లేడీ దర్శకురాలు సుధాకొంగర రూపొందించిన చిత్రం సూరరై పోట్రు..తెలుగులో ఆకాశం నీ హద్దురాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ చిత్రం థియేటర్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయి హిట్ ని సాధించింది. ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ సూర్య నటించారు కాగా ఆయన భార్యగా అపర్ణ బాల మురళీ నటించారు. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. 670 పేజీలుండే ‘సింప్లీ ఫ్లై’ బుక్‌ను దర్శకురాలు సుధ రెండు గంటల సినిమాగా మలిచి మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకురాలు/దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచినట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు మేకర్స్. తాజాగా ఆస్కార్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 366 ఉత్తమ చిత్రాల తుది జాబితాని ప్రకటించగా, ఇందులో మన దేశం నుండి సూరరై పోట్రు నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. తుది జాబితాలోని విజేత చిత్రాలను వచ్చే మార్చ్ 15న ప్రకటించనున్నారు. మార్చి 5 నుండి 10 మధ్య అకాడమీ వారు ఓటింగ్ నిర్వహించి విజేతలను తెలియజేయనున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఓ ఇండియన్ చిత్రం ఆస్కార్ రేసులో నిలవడం విశేషం.
Advertisement
తాజా వార్తలు
Advertisement