Friday, November 22, 2024

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ట్రెండీ క‌ల్చ‌ర్..మరీ ఇప్పుడు

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలయ్యాక ప్రతీ అంశమూ వివాదాస్పదమవుతూనే ఉంది. ముఖ్యంగా ముస్లిం మహిళలు షరియా చట్టాల ప్రకారం బుర్ఖాలు ధరించాలన్న తాలిబన్ల సర్కార్ ఆదేశాలు ఇప్పుడు అక్కడి మహిళలకు ఇబ్బందికరంగా మారాయి. ఇన్నాళ్లూ ప్రజా ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛగా తమ హక్కుల్ని అనుభవించిన మహిళలు ఇప్పుడు తాలిబన్ల ఆదేశాలను ధిక్కరించేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెతను అమల్లో పెట్టేశారు. దీంతో తాలిబన్లకు ఇదో భారీ షాక్ గా మారుతోంది. తాలిబన్లు రాకముందు అక్కడి మహిళలు స్వేచ్చగా బతికేవారు.

ఒకప్పుడు వారు యూరోపియన్లుగా ఆఫ్ఘన్ మహిళలు, పురుషులు ఫ్యాషన్‌గా ఉండేవారు. కానీ నేటి ఆఫ్ఘనిస్తాన్‌కి ఇది ఒక కల లాంటిది (తాలిబాన్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్ విద్య). ఎందుకంటే రాడికల్ తాలిబాన్ సంస్థ ప్రతిదీ మార్చింది.

ఆఫ్ఘనిస్తాన్ పాత చిత్రాలలో ఫ్యాషన్ హబ్‌గా కనిపిస్తుంది. 70ల నుండి వచ్చిన చిత్రంలో మహిళలు ఫ్యాషన్ దుస్తులు ధరించారు. వారి హెయిర్ స్టైల్ చాలా ప్రత్యేకమైనది. కానీ నేటి కాలంలో ఆమె బురఖా లేకుండా జీవించలేరు.

1950- 60 త‌రువాత ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ట్రెండీ క‌ల్చ‌ర్ మొద‌లైంది. పాశ్చాత్య దుస్తులు ధ‌రించ‌డం అల‌వాటు చేసుకున్నారు.  అయితే, 1996 నుంచి 2001 మ‌ధ్య‌లో తాలిబ‌న్లు ఆక్ర‌మ‌ణ‌ల‌తో తిరిగి బుర్ఖాలు ధ‌రించాల్సి వ‌చ్చింది.

- Advertisement -

 2001 త‌ర‌వాత తిరిగి ప్ర‌జాస్వామ్య పాల‌నలోకి రావ‌డంతో ప్ర‌జ‌లు స్వ‌తంత్రంగా జీవించ‌డం మొద‌లు పెట్టారు.  త‌మ‌కు న‌చ్చిన దుస్తులు వేసుకుంటున్నారు.  కాగా, ఇప్పుడు మ‌రోసారి స‌డెన్‌గా తాలిబ‌న్ల పాల‌న‌లోకి ఆఫ్ఘ‌న్ వెళ్ల‌డంతో అక్క‌డి మ‌హిళ‌లు ఆందోళ‌న చేస్తున్నారు. 

ముఖ్యంగా దుస్తుల విష‌యంలో ఆంక్ష‌లు విధించ‌వ‌ద్ద‌ని, త‌మ హ‌క్కుల‌ను నాశ‌నం చేసే హ‌క్కు ఎవ‌రికీ లేదని మ‌హిళ‌లు ఉద్య‌మిస్తున్నారు.  సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆఫ్ఘ‌న్ క‌ల్చ‌ర్ పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఆఫ్ఘ‌నిస్తాన్ ట్రెడిష‌న‌ల్ దుస్తులు ధ‌రించి పోస్ట్ చేస్తున్నారు.  

#Afghanistanculture #DonotTouchMyClothes పేరుతో హ్యాష్ ట్యాగ్స్‌ను క్రియోట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.  నెటిజ‌న్ల నుంచి వీరికి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు వ‌స్తుండ‌టం విశేషం.  

\
https://twitter.com/sibghat51539988/status/1437063220385263623

ఇది కూడా చదవండి: ఐసీసీకి చేరిన ఐదో టెస్ట్ పంచాయతీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement