Tuesday, November 26, 2024

అహ్మదాబాద్‌: పిచ్ విమర్శకులపై అశ్విన్ ఫైర్

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య పింక్‌ టెస్టు రెండురోజుల్లోనే ముగియ టంపై పలువురు మాజీల నుంచి విమ ర్శలు వెలువడుతున్నాయి. వీరిపై టీమి ండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తనదైన శైలిలో మండిపడ్డాడు. విమర్శకులపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశాడు. భారతజట్టు విజయాన్ని ఒకింత తక్కు వగా చేయడాన్ని యాష్‌ తప్పుబట్టాడు. కాగా మొతేరా పిచ్‌పై యువరాజ్‌సింగ్‌, హర్భజన్‌సింగ్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌తోపాటు బ్రిటిష్‌ మీడియా కూడా పలు విమర్శలు చేసింది. ఈ విమర్శలను అశ్విన్‌ తిప్పికొడుతూ..మార్కెటింగ్‌ వ్యూహాల కారణంగానే ఉత్పత్తులు అమ్ముడవుతాయి. ఇది అందరూ ఆమోదించిన పద్ధతి. మనం ప్రస్తుతం ఆలోచనలను కూడా విక్రయించేయుగంలో జీవిస్తున్నాం. ఆలోచనలను అమ్మడం ఔట్‌బాండ్‌ మార్కెటింగ్‌కు తగిన ఉదాహరణ అని ట్వీట్‌ చేశాడు. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సోషల్‌మీడియా వేదికగా వారి అభిప్రాయాలు నిజమైనవిగా ఒప్పించేం దుకు ప్రయత్నిస్తున్నారని..బ్యాట్స్‌మెన్‌ విఫలమైతే పిచ్‌ను నిందిస్తున్నారని అశ్విన్‌ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగియటంపై యువీ స్పందిస్తూ ఇది సంప్రదాయ క్రికెట్‌కు మంచిది కాదని పేర్కొన్నాడు. అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ తోపాటు కెరీర్‌లో 100వ టెస్టు ఆడిన ఇషాంత్‌కు అభినందనలు తెలుపుతూనే.. ఈ వికెట్‌పై కుంబ్లే, భజ్జీ 1000, 800వికెట్లు తీసేవారని పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement