విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ రోజిక్కడ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకినాడ సెజ్ భూముల నష్టపరిహారం ఖరారుకు ఆమోదం లభించింది. నవరత్నాల అమలు క్యాలెండర్ కు కూడా ఈ కేబినెట్ భేటీలో ఆమోదంతెలిపింది. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు ఇండస్ట్రియల్ పార్కులకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ మారిటైమ్ బోర్డుకు భూమి కేటాయింపుపైనా కేబినెట్ చర్చించింది.
అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం :ఏపీ కేబినెట్ నిర్ణయం
Advertisement
తాజా వార్తలు
Advertisement