ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణ పనుల్లో కీలక ఘట్టంగా భావిస్తున్న గడ్డర్ల అమరిక పూర్తయింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ అయిన మేఘ ఇంజనీరింగ్ అధికారికంగా ప్రకటించింది. స్పిల్ వే బ్రిడ్జికి గడ్డర్లను అమర్చటం ప్రాజెక్టులో అత్యంత కీలక మైన పనిగా ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. స్పిల్ వేపై మొత్తం 192 గడ్డర్లను విజయ వంతంగా అమర్చినట్టు- వెల్లడించారు. కేవలం 60 రోజుల్లో 192 గడ్డర్లను అమర్చటం ద్వారా ప్రాజెక్టు నిర్మాణంలో కీలకఘట్టాన్ని పూర్తి చేసినట్టు- భావిస్తున్నారు. స్పిల్ వే పై గడ్డర్ల అమరిక, షట్టరింగ్ పనులు పూర్తి కావటంతో స్లాబ్ నిర్మాణంపై దృష్టి సారించినట్టు- తెలిపారు. ఒక్కొక్క గడ్డర్ పొడవు 23 మీటర్లు.. వెడల్పు రెండు మీటర్లు.. ఒక గడ్డర్ కు 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించినట్టు- వెల్లడించారు. ఒక్కొక్క గడ్డర్ బరువు 62 టన్నులు. స్పిల్ వేకి ఈ స్థాయి బరువున్న గడ్డర్లను వినియోగించటం చాలా అరుదుగా భావిస్తు న్నారు. గడ్డర్ల బరువుతో పాటు- గడ్డర్ల సంఖ్య కూడా అధికమేనని ఇంజనీర్లు తెలిపారు. 192 గడ్డర్ల తయారీ కోసం 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు. గత ఏడాది ఫిబ్రవరి 17న గడ్డర్ల తయారీని ప్రారంభించారు. స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్లను అమర్చటానికి 200 టన్నుల బరువున్న రెండు భారీ క్రేన్లను వినియోగించారు. స్పిల్ వే పిల్లర్లపై గడ్లర్లను అమర్చే ప్రక్రియను గత ఏడాది జులై 6న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గోదావరికి వరదలు రాకముందే స్పిల్‌వే పిల్లర్లపై గడ్డర్లను అమర్చటమే లక్ష్యంగా పనులు పూర్తి చేయటం ద్వారా మేఘా ఇంజనీరింగ్ సంస్థ పోల వరం నిర్మాణంలో ఒక కీలకమైన మైలురాయిని దాటిందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement