తెలంగాణలో పార్టీ వద్దని జగన్ చెప్పినా ఆయన సోదరి, దివంగత సీఎం వైస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల వినలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే తెలంగాణలో పార్టీ ఎందుకు ఉండకూడదన్న విషయంపై గత మూడు నెలలుగా వైఎస్ కుటుంబంలో చర్చ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన జగన్ మాత్రం ఏపీకే ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణలో పార్టీ వద్దని అన్నారనీ, అయితే తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తున్నదని సజ్జల పేర్కొన్నారు. జగన్, షర్మిల మధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే తప్ప విభేదాల కావని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement