పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూతురిని పాకిస్థాన్ యువ పేసర్ పేసర్ షహీన్ షా అఫ్రిది పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు షహీన్ షా కుటుంబ సభ్యులు తమ కుటుంబాన్ని కలిసి మాట్లాడినట్లు అఫ్రిది ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘నా కూతురు కోసం షహీన్ కుటుంబం మా కుటుంబాన్ని అడిగారు. రెండు కుటుంబాలు ఈ విషయంపై మాట్లాడుకున్నాయి. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయి. దేవుడు దయతలిస్తే వీళ్ల పెళ్లి కూడా జరుగుతుంది’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement