బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఫాంటమ్ ప్రొడక్షన్ కంపెనీపై ఐటీ అధికారుల దాడుల్లో భారీ మొత్తంలో లెక్కలు తారుమారయ్యాయని అధికారులు చెపుతున్నారు. అనురాగ్ కశ్యప్, తాప్సీకి సంబంధించిన ఇళ్లు ఆఫీసులపై సోదాలు నిర్వహించిన అధికారులు లెక్కలు చూపని రూపాయలు కోట్లలో ఉన్నాయని గుర్తించారు. ఆక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారనే సమాచారంతో హీరోయిన్ తాప్సీతో పాటు అనురాగ్ కశ్యప్, నిర్మాత మధుతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లతో పాటు ఆఫీసులపై ఏక కాలంలో దాడులు చేశారు. తాప్సీ కి సంబంధించిన 5 కోట్ల రూపాయలకు టాక్స్ లెక్కలు సరిపోలేవని, అనురాగ్ కశ్యప్ 20 కోట్ల రూపాయలకు సంబంధిచిన టాక్స్ ఎగ్గొట్టారని అధికారులు చెబుతున్నారు. ఇక ఫాంటమ్ ఫిలిం ప్రొడక్షన్‌లో చేసిన సినిమాలన్నింటి లెక్కలు సరిచూడగా దాదాపు 650 కోట్లకు సంబంధించిన లెక్కలు తారుమారయినట్లు అధికారులు చెబుతున్నారు. ఫాంటమ్ ఫిలిం కంపెని స్టాఫ్ 300 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పలేదని, మరో 350 కోట్ల టాక్స్ చెల్లించలేదని చెప్పారు. ఐతే ఫాంటమ్ ఫిలిం కంపెనీపై ఉన్న టాక్స్ కేసు నిమత్తం ముంబై, పుణలోని 28 చోట్ల ఐటీ దాడులు జరిగాయి. వీటితో పాటుగా రిలయన్స్, క్వాన్ సంస్థలపైన కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం వాటి లెక్కలు రాబట్టే పనిలో ఉన్నారు అధికారులు.
Advertisement
తాజా వార్తలు
Advertisement