Monday, December 23, 2024

హైదరాబాద్ : మరో 50లక్షల మొక్కలు- ఏడో విడత హరితహారానికి సన్నద్ధం

మరో 50 లక్షలు మొక్కలు నాటేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏడో విడత హరిత హారంలో 50లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నది.  జిల్లాల్లో వివిధ  ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 50లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా అన్ని పంచాయతీల్లో, అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉపాధి నర్సరీల్లో మొక్కల పెంపకానికి అవసరమైన ప్లాస్టిక్‌ సంచుల్లో మట్టి నింపడం, విత్తనాలు నాటే పనులు దాదాపు పూర్తి చేశారు.   గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఇంటింటా చింత చెట్లు పెద్ద సంఖ్యలో కనిపించేవి. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా ప్రస్తుతం 70శాతానికి పైగా చింతచెట్లు క్షీణించాయి. దీంతో గ్రామీణులు సైతం చింతపండు అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఐదో విడత హరితహారంలో చింతచెట్ల పెంపకానికి ప్రాధాన్యతను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలో రహదారుల

Advertisement

తాజా వార్తలు

Advertisement