Tuesday, December 24, 2024

వరంగల్ : పార్టీ సభ్యత్వం తీసుకున్న వారందరికీ బీమా : ఎర్రబెల్లి

దేశంలో పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండలం ఆరెగూడెంకు చెందిన 30 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.   హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువా కప్పి  ఎర్రబెల్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ,  దేశంలో 60 లక్షల సభ్యత్వాలను ఆన్‌లైన్‌ చేసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. పార్టీలో చేరిన ప్రతి సభ్యుడికి సముచిత గౌరవం దక్కుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement