Friday, December 20, 2024

న్యూఢిల్లీ : విరాట్ కెప్టెన్సీ ఎంతో ఇష్టం : యోహాన్ బ్లేక్

జమైకా స్ప్రింటర్‌ యోహన్‌ బ్లేక్‌ టీమిండియా సారథి విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘తొలి టెస్టులో ఓటమి తరువాత తప్పులు, వైఫల్యాలు అంగీకరించ డం చాలా నచ్చింది. టెస్టు క్రికెట్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. భారత్‌-ఇంగ్లండ్‌ రెండో టెస్టు కోసం ఎదురుచూస్తున్నా. తొలి టెస్టు చివరి రోజు ఇరు జట్లు ఎంతో బాగా ఆడాయి. రూట్‌ అద్భుతంగా ఆడాడు. శ్రీలంక ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అదరగొడుతున్నాడు. వయస్సు కేవలం అతనికి ఒక సంఖ్య మాత్రమే అని భావిస్తున్నాను. ఆయన బంతుల్లో పదును తగ్గలేదు. టీమిండియా అంటే నాకెంతో ఇష్టం. విరాట్‌ కెప్టెన్సీని ప్రేమిస్తుంటాను. చేసిన తప్పును అంగీకరిస్తాడు. జట్టు ప్రణాళికల్లో కీలకం వ్యవహరిస్తాడు. అందుకే కోహ్లీ నాయకత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. గిల్‌ బ్యాటింగ్‌ బాగుంది. అతడు గొప్ప బ్యాట్స్‌మెన్‌. పంత్‌ మరో అద్భుతం. పుజారా ఎంతో నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌. ఆసీస్‌లో అతని పోరాటాన్ని చూశాను. బాగుంది. రెండో టెస్టు కోసం ఎదురుచూస్తు న్నా’ అంటూ బ్లేక్‌ చెప్పుకొచ్చాడు. 2011 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బ్లేక్‌ 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించాడు. ఉసేన్‌ బోల్డ్‌ తరువాత.. అతివేగవంతమైన పరుగుల వీరుడిగా బ్లేక్‌ రికార్డులు సృష్టించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement