కొత్త ఫండ్ ఇన్వెస్కో ఇండియా ఈఎస్ జీ ఈక్విటీ ఫండ్‌ను ఆవిష్క రించినట్టు ఇన్వెస్కో మ్యూ చువల్ ఫండ్ వెల్లడిం చింది. ఎన్‌ఎఫ్‌వో(న్యూ ఫండ్ ఆఫర్) ఫిబ్రవరి 26, 2021 న మొదలై.. మార్చి 12, 2021న ముగియనుందని ఇన్వెస్కో వెల్లడించింది. ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్(ఈఎస్‌జీ) విధానాలను పాటించే కంపెనీల ఈక్విటీల్లో 80 శాతం నుంచి 100 శాతం వరకు పెట్టుబడులు పెట్టి రిటర్నులు పొందే ఉద్దేశ్యంతో ఇన్వెస్కో ఈ స్కీమ్‌ను రూపొందించింది. ఇందుకోసం తగిన విధంగా ఈ స్కీమ్‌ను రూపకల్పన చేసింది. బోటమ్-అప్ విధానంలో ఈ ఫండ్ స్టాక్స్ ఎంపిక చేయనుంది. లార్జ్ కంపెనీల్లో పెట్టుబడులకు ఈ ఫండ్ ప్రాధాన్యత ఇవ్వనుంది. స్మాల్ క్యాప్ కంపెనీల్లో 35 శాతం వరకు పరిమితంగా పెట్టుబడులు పెట్టనుంది. నిఫ్టీ 100 ఎన్‌హెన్స్‌డ్ ఈఎస్‌జీ సూచీ ప్రామాణికంగా ఈ సూచీ పనిచేయనుంది. ఈ ఫండ్‌ను తహెర్ బాద్‌షా, అమిత్ నిగమ్ నిర్వహించనున్నారు. తహెర్ బాద్‌షాకు 26 ఏళ్లకుపైగా, అమిత్ నిగమ్‌కు 20 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఒక సంస్థగా వ్యాపారాల్లో ఈఎస్‌జీ విధానాలను ప్రోత్సాహిస్తున్నామని ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ సౌరబ్ నానావతి ఈ సందర్భంగా పేర్కొ న్నారు. తొలి సారి పెట్టుబడిపెట్టేవారు తమ ఇన్వెస్ట్‌మెంట్ ప్రయాణాన్ని ప్రారం భించొచ్చని ఆయన అన్నారు. ఎన్‌ఎఫ్‌వో సమయంలో కనీస ఇన్వెస్ట్‌మెంట్ రూ.1000 ఉంటుంది. ఆ తర్వాత పెట్టుబడి రూ.1కు బహుళంగా ఉండనుంది. సిప్ ఇన్వెస్ట్‌మెంట్ కనీసం అప్లికేషన్ మొత్తం రూ.500గా ఉండనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement