Thursday, December 26, 2024

నాలుగో టెస్టుపై పట్టు బిగిస్తున్న టీమిండియా

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుపై టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోర్లకే వెనుతిరిగినా రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్‌ల పోరాట పటిమతో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 294/7 స్కోరు చేసింది. రోహిత్ (49) తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా.. పంత్ (101), సుందర్ (60 బ్యాటింగ్) చెలరేగడంతో భారత్ ఇప్పటివరకు 89 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రహానె (27), పుజారా (17), అశ్విన్ (13) పరుగులు చేయగా.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ డకౌట్లు అయ్యారు. అక్షర్ పటేల్ (11) క్రీజులో ఉన్నాడు. ఈ టెస్టులో సిక్సర్‌తో పంత్ సెంచరీ సాధించడం విశేషం. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌటైన సంగతి విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement