వ‌ల‌స లంబాడాల‌ను వెళ్ల‌గొట్టాల్సిందే!

వ‌ల‌స లంబాడాల‌ను వెళ్ల‌గొట్టాల్సిందే!

ఉమ్మ‌డి ఆదిలాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : అనాదిగా అడవులను నమ్ముకుని జీవిస్తున్నఆదివాసుల‌(Adivasis) మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, హక్కుల కోసం న్యాయపోరాటమే శరణ్యమని ఆదివాసీ సంఘాలు స్పష్టం చేశాయి. చట్టబద్ధతలేని వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్(demand) చేస్తూ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ జ‌రిగింది.

తంతోలి ముత్యాలమ్మ వాగు నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాద‌యాత్ర లో రాయి సెంటర్లు, సార్ మేడిలు, రాజ్ గోండు సేవా సమితి త‌దిత‌ర‌ తొమ్మిది సంఘాల ఆదివాసులు పాల్గొన్నారు. ఆదివాసీ మహిళలు యువకులు, జెండాలు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

కొమరం భీం(Komaram Bhim) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌(Collectorate)ను ముట్టడించి కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్నిసమర్పించారు. ఆదివాసీ సంఘాల నాయకులు మంగం విశ్వంభర్(Mangam Vishwambhar), తానాజీ, శ్యామ్ రావు, జంగు పటేల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సంఘ నాయ‌కులు మాట్లాడుతూ 1970 తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు వలస వచ్చిన లంబాడాలు తమ హక్కులను రిజర్వేషన్లను వినియోగించుకుంటూ తమ జీవన ప్రమాణాలు దెబ్బతిస్తున్నారని ఆరోపించారు.

ఆదిలాబాద్(Adilabad) ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల కుటుంబాలు ఎస్టీ రిజర్వేషన్ల కోసమే వలస వచ్చి ఉపాధి పొందుతున్నాయని వారు ఆరోపించారు. చట్టబద్ధతలేని లంబాడాలను జాబితా నుంచి తొలగించాలని, ఇప్పటికే సుప్రీంకోర్టు నుండి ప్రభుత్వాలకు నోటీసులు కూడా అందాయని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు.

Leave a Reply