కొత్త డివిజన్లపై వెంటనే దృష్టి పెట్టాలి
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్ఠం చేయాలి
పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి బుద్ధా వెంకన్న
ప్రతి బూత్‌కు కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలి
ఓటర్ల జాబితాపై క్షేత్రస్థాయిలో పక్కా పరిశీలన
ఎన్నికలకు ముందే బూత్ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి
విజయవాడ, ఆంధ్రప్రభ: పశ్చిమ నియోజకవర్గంలో కొత్త డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొత్త డివిజన్లలో పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడంతో పాటు సంస్థాగత కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ కొత్త డివిజన్ల ఏర్పాటు విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ప్రతి డివిజన్‌లో పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులతో పాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతి బూత్‌కు సంబంధించిన బూత్ కన్వీనర్ల జాబితాను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న బూత్‌లతో పాటు కొత్తగా ఏర్పడిన బూత్‌లకు కూడా కన్వీనర్లను ఎలాంటి జాప్యం లేకుండా నియమించాలని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన కీలక సంస్థాగత కార్యక్రమాల్లో ఆలస్యం ఉండకూడదన్నారు.
ఎన్నికలకు ముందే ప్రతి బూత్‌లో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని బుద్ధా వెంకన్న అన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా తీసుకెళ్లగలమన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వేగంగా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
