అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత..

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పట్టుకొని సీజ్ చేసినట్లు చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ శుక్రవారం తెలిపారు. మండలంలోని జడలపేట క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, కాల్వపల్లి మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక లోడుతో వస్తున్న జాన్ డీర్ ట్రాక్టర్ టిఎస్ 22 డి 2607 ను పోలీసులు ఆపారు. ట్రాక్టర్ డ్రైవర్ యజమాని ఈరవేణి సంతోష్ ను విచారించగా, ఇసుక రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేవన్నారు. దీంతో కేసు నమోదు చేసి ట్రాక్టర్ పోలీస్ స్టేషన్ తరలించినట్లు తెలిపారు.
అనంతరం ఎస్సై సతీష్ మాట్లాడుతూ.. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినా, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఎం. సురేందర్, కానిస్టేబుల్స్ నాగరాజు, బుర్ర రంజిత్ పాల్గొన్నారు.
