ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఐలయ్య..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అంశాలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య కలిసి చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అమలు కావలసి ఉన్న సంక్షేమ పథకాలను గురించి ఐలయ్య ఆయనకు వివరించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుండి అవసరమైన సహకారాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా ఐలయ్య ఆయనకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి లక్ష్యంగా తాము కొనసాగిస్తున్న ముమ్మర కృషికి అండదండగా నిలవాలని ఆయన కోరారు.