తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు
ధర్మపురి, ఆంధ్రప్రభ : రహదారులపై తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ధర్మపురి రెండవ ఎస్ఐ మిర్యాల రవీందర్(Miryala Ravinder) అన్నారు. ఈ రోజు మండలంలోని రాయపట్నం రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనికి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అదేవిధంగా లైసెన్స్ తదితర పత్రాలను ఉండాలన్నారు. మైనర్లు వాహనాలు నడపరాదని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు ప్రకారం వాహనాలు నడపాలని ఆయన సూచించారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ లు రమేష్ నాయక్ , మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

