అలా చేస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవు..
దండేపల్లి, (ఆంధ్రప్రభ) : రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీబీ ఆర్ ప్రకాష్, లక్షేటి పేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో శనివారం దండేపల్లి మండలం మేదరి పేట కాకతీయ డిగ్రీ కళాశాలలో దండేపల్లి ఎస్సై తహసీనుద్దీన్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు వాహనాన్ని బయటకు తీసే ముందు సరైన ధ్రువ పత్రాలు దగ్గర ఉంచుకోవాలని.. వాహనాల పై స్పీడ్ గా వెళ్లకూడదని అన్నారు. ఆటో డ్రైవర్లు వాహనం నడుపుతున్నప్పుడు మద్యం సేవించకూడదని ప్యాసింజర్లను ఇబ్బందులు పెడితే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనాలను ఓవర్ టేక్ చేసేటప్పుడు రెండు వైపులా చూసుకొని నెమ్మదిగా వెళ్లాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

