Nuclear Strike: ఇరాన్‌పై అమెరికా అణుదాడి చేస్తే.. భారత్‌పైనా రేడియేషన్ ప్రభావం ఉంటుందా..?

చ‌రిత్ర‌లో అణుదాడి ఎక్క‌డ జ‌రిగింది..
దాని ప్ర‌భావం ఏ దేశాల‌పై ప‌డింది..

జ‌పాన్ పై అమెరికా ఎందుకు అణు బాంబు వేసింది..?
దాని వెనక దాగివున్న చరిత్రేంటి..?

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అణు బాంబులు ఉన్నాయి..?
అణుదాడి జ‌రిగితే మాన‌వుడి ఆరోగ్యంపై ఎలా ప్ర‌భావం చూపిస్తాయి..

Nuclear Strike: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని ‘పికాక్స్ మౌంటైన్‌’పై అణుదాడి (nuclear strike) దాడి చేసే అవకాశముందని ప్రకటించడంతో అంతర్జాతీయంగా తీవ్ర చర్చ మొదలైంది. అమెరికా మాజీ ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత, ట్రంప్‌కు సన్నిహితుడైన టక్కర్ కార్ల్‌సన్.. ఇరాన్‌పై అమెరికా అణుదాడికి సిద్ధమవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అణుదాడి జరిగితే దాని రేడియేషన్ ప్రభావం భారత్‌ వరకు చేరుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అణుదాడి జరుగుతుందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. ట్రంప్ కూడా గతంలో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

పికాక్స్ మౌంటైన్ ఎక్కడ ఉంది..?

ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఉన్న పికాక్స్ మౌంటైన్‌లో భూగర్భ అణు కేంద్రం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేంద్రం భారీ పర్వతం కింద సుమారు 328 అడుగుల లోతులో ఉన్నట్లు అంచనా. ఇక్కడ ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో కొంత భాగాన్ని ఉంచినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై పూర్తి స్థాయి ఆధారాలు బహిరంగంగా అందుబాటులో లేవు. గతంలో ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పటికీ, పికాక్స్ మౌంటైన్ లోతు కారణంగా సాధారణ బంకర్ బస్టర్ బాంబులతో దానిని ధ్వంసం చేయడం కష్టమని చెబుతున్నారు.

భారత్‌కు రేడియేషన్ ముప్పు ఉందా..?

ఇరాన్‌పై అణుదాడి జరిగితే దాని రేడియోధార్మిక కాలుష్యం పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంతో పాటు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ వరకు వ్యాపించే అవకాశం ఉందని భౌగోళిక రాజకీయ నిపుణుడు మారియో నవ్‌ఫాల్ పేర్కొన్నారు. ఆయన పంచుకున్న నమూనా ఆధారిత అంచనాల ప్రకారం.. గాలుల దిశ అనుకూలంగా ఉంటే భారత్‌లోని వాయవ్య ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, గుజరాత్ ప్రాంతాల వరకు తక్కువ స్థాయిలో రేడియోధార్మిక కణాలు చేరే అవకాశం ఉంది. అయితే ఇరాన్ నుంచి భారత్‌కు సుమారు 2,500 కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రయాణించే కొద్దీ రేడియేషన్ తీవ్రత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

గాలులు, వర్షాలే కీలకం!

అణు పేలుడు తీవ్రత, ఆయుధ సామర్థ్యం, పేలుడు జరిగే విధానం, గాలుల వేగం, దిశ వంటి అంశాలపై రేడియేషన్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని రక్షణ రంగ నిపుణుడు సందీప్ ఉన్నితన్ తెలిపారు. గాలులు తూర్పు దిశగా వీచినట్లయితే అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని చెప్పారు. అక్కడి నుంచి వాయవ్య భారతదేశానికి రేడియోధార్మిక కణాలు చేరినా వాటి సాంద్రత చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చని వివరించారు. వర్షాలు కూడా రేడియేషన్ వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. వర్షం కురిసే ప్రాంతాల్లో రేడియోధార్మిక కణాలు స్థానికంగా ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకారం.. పెద్ద రేడియోధార్మిక కణాలు పేలుడు ప్రాంతానికి సమీపంలోనే నేలపై పడిపోతాయి. చిన్న కణాలు మాత్రం గాలిలో ఎక్కువసేపు ఉండి సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు.

అణుదాడి జరిగితే అంతర్జాతీయ పరిణామాలు తీవ్రం!

అణుదాడి జరిగితే ఇరాన్‌కు తక్షణమే తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా, అమెరికాకు కూడా అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌బీ ఆస్తానా అభిప్రాయపడ్డారు. రేడియోధార్మిక ప్రభావం పాకిస్థాన్, కువైట్, జోర్డాన్ వంటి ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మొత్తంగా ఇరాన్‌పై అణుదాడి జరిగితే అది కేవలం ఆ దేశానికే పరిమితమైన విపత్తు కాదు. రేడియేషన్ వ్యాప్తితో పాటు అంతర్జాతీయ రాజకీయ, సైనిక పరిణామాలు కూడా తీవ్రంగా మారే అవకాశం ఉంది. అయితే భారత్‌పై వాస్తవ ప్రభావం ఎంత ఉంటుందనేది దాడి స్వరూపం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

గ‌తంలో చ‌రిత్ర‌లో అణుదాడి ఎక్క‌డ జ‌రిగింది.. దాని ప్ర‌భావం ఏ దేశాల‌పై ప‌డింది.. దీన్ని ప్ర‌భావం భారత్‌పైనా రేడియేషన్ ప్రభావం ఉంటుందా..?

మానవ చరిత్రలో యుద్ధంలో అణ్వాయుధాలను ప్రయోగించిన అణుదాడి జపాన్‌పై మాత్రమే జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో అమెరికా ఈ దాడులు చేసింది. అమెరికా జపాన్‌లోని రెండు ప్రధాన నగరాలపై అణుబాంబులను వేసింది..

  • హిరోషిమా (Hiroshima): 1945 ఆగస్టు 6న అమెరికా ‘లిటిల్ బాయ్’ (Little Boy) అనే యురేనియం బాంబును హిరోషిమా నగరంపై వేసింది. ఈ దాడి వల్ల దాదాపు 1,40,000 మందికి పైగా ప్రజలు అక్కడికక్కడే మరియు ఆ సంవత్సరం చివరి నాటికి మరణించారు.
  • నాగసాకి (Nagasaki): ఆ తర్వాత మూడు రోజులకు, అనగా 1945 ఆగస్టు 9న ‘ఫ్యాట్ మ్యాన్’ (Fat Man) అనే ప్లుటోనియం బాంబును నాగసాకి నగరంపై ప్రయోగించింది. దీనివల్ల దాదాపు 74,000 మందికి పైగా మరణించారు.

దీని ప్రభావం ఏ దేశాలపై పడింది..?

  • జపాన్ తీవ్రంగా నష్టపోయింది: ఈ దాడుల ప్రభావం ప్రత్యక్షంగా, పూర్తిగా జపాన్ దేశంపైనే పడింది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, బతికిన వారు దశాబ్దాల పాటు క్యాన్సర్, జన్యుపరమైన లోపాలు, రేడియేషన్ అనారోగ్యాలతో (Radiation Sickness) నరకం అనుభవించారు. నగరాలు పూర్తిగా బూడిదయ్యాయి.
  • భౌగోళిక రాజకీయ ప్రభావం (Geopolitical Impact): పరోక్షంగా దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నిటిపైనా పడింది. ఈ దాడుల తర్వాత జపాన్ లొంగిపోవడంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. కానీ, ప్రపంచంలో “అణు పోటీ (Nuclear Arms Race)” మొదలై సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ఇతర దేశాలు కూడా అణ్వాయుధాలను తయారు చేసుకోవడం ప్రారంభించాయి.

భారత్‌పైనా రేడియేషన్ ప్రభావం ఉంటుందా..?

గతంలో జపాన్‌పై జరిగిన అణుదాడి వల్ల భారతదేశంపై ఎలాంటి రేడియేషన్ ప్రభావం పడలేదు. ఎందుకంటే జపాన్ భారతదేశానికి చాలా దూరంగా ఉండటం, ఆ బాంబుల తీవ్రత (ఈనాటి ఆధునిక అణ్వాయుధాలతో పోలిస్తే) తక్కువగా ఉండటం వల్ల ఆ రేడియేషన్ భారతదేశం వరకు రాలేదు.

కానీ, భవిష్యత్తులో పొరుగు దేశాల మధ్య అణుయుద్ధం జరిగితే భారత్‌కు ముప్పు ఉంటుందా?

అవును, ఒకవేళ ప్రస్తుత ఆధునిక కాలంలో భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్ లేదా చైనా వంటి దేశాల మధ్య గానీ, లేదా సమీపంలోని ఇరాన్ లేదా మధ్యప్రాచ్య (Middle East) దేశాలలో గానీ అణుయుద్ధం జరిగితే..

  • ఆధునిక అణ్వాయుధాల తీవ్రత: ప్రస్తుత బాంబులు జపాన్‌పై వేసిన వాటికంటే వందల రెట్లు శక్తివంతమైనవి.
  • అణు వ్యర్థాల వ్యాప్తి (Nuclear Fallout): అణు పేలుడు జరిగినప్పుడు వెలువడే రేడియేషన్ కణాలు గాలి తరంగాలు, మేఘాల ద్వారా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.
  • వాతావరణ మార్పులు: పొరుగు దేశాలలో అణు పేలుళ్లు జరిగితే, ఆ రేడియేషన్ గాలి దిశను బట్టి వాయవ్య భారతదేశానికి లేదా సరిహద్దు ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉంది. తీవ్రమైన అణుయుద్ధం జరిగితే ప్రపంచవ్యాప్తంగా “అణు శీతాకాలం” (Nuclear Winter) ఏర్పడి సూర్యరశ్మి భూమికి చేరక, పంటలు పండక భారతదేశంతో సహా ప్రపంచదేశాలన్నీ తీవ్ర కరువును ఎదుర్కోవాల్సి వస్తుంది.

జ‌పాన్ పై అమెరికా ఎందుకు అణు బాంబు వేసింది..? దాని వెనక దాగివున్న చరిత్రేంటి..?

రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో, 1945 ఆగస్టు 6న జపాన్‌ దేశంలోని హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు దాడి చేసింది. ఆ దాడి ప్రపంచాన్ని షాకయ్యేలా చేసింది. అయినా తగ్గని అమెరికా.. మళ్లీ ఆగస్టు 9న నాగసాకిపై మరో అణు బాంబు దాడి చేసింది. ఈ అనుదాడిలో ఎంతో మంది చనిపోయారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, జంతువులు, ప్రాణులన్నీ క్షణాల్లో బూడిదైపోయాయి. బాంబు దాడి తర్వాత రేడియేషన్ ప్రభావంతో కొన్ని దశాబ్దాల పాటూ.. అక్కడ ప్రజలు వికలాంగులుగా పుట్టారు.

అసలు అమెరికా ఈ అణు బాంబు దాడికి ఎందుకు సిద్ధమైంది అనే దానిపై ఇప్పటికీ చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ దేశాన్ని పూర్తిగా ఓడించి, సుదీర్ఘంగా సాగుతున్న ఆ మహా యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడమే తమ ప్రధాన లక్ష్యం అని అప్పట్లో అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒకవేళ భూమార్గంలో జపాన్‌పై దాడికి దిగితే లక్షల మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతారనీ, అలా జరగకూడదనే ఈ కఠినమైన నిర్ణయం.. తప్పనిసరి పరిస్థితులలో తీసుకున్నామని అమెరికా సైన్యం చెప్పింది. కానీ ప్రముఖ శాస్త్రవేత్తల సంస్థ.. బులిటెన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ లాంటి అంతర్జాతీయ సంస్థల లోతైన విశ్లేషణల ప్రకారం.. జపాన్ అప్పటికే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఈ బాంబు దాడి చేసింది.

వాస్తవానికి, జపాన్‌ని ఓడించాలి అనే ఉద్దేశం కంటే, ప్రపంచానికి తమ సైనిక శక్తిని ప్రదర్శించాలన్నదే అమెరికా అసలు ఉద్దేశం అని ఆధునిక చరిత్రకారులు బలంగా చెబుతారు. మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్ అనే పేరుతో అత్యంత రహస్యంగా కోట్ల డాలర్లు ఖర్చు చేసి తయారుచేసిన ఈ అణు బాంబు శక్తిని, ఆ సమయంలో తమకు ప్రధాన పోటీదారుగా ఎదుగుతున్న సోవియట్ యూనియన్ (రష్యా)కి చూపించి, భయపెట్టాలన్న కుటిల వ్యూహం అందులో దాగి ఉంది. భవిష్యత్తులో రాబోయే సివిల్ వార్‌లో యావత్ ప్రపంచంపై తమ ఏకఛత్రాధిపత్యాన్ని చూపించడానికి అమెరికా, ఈ మహా వినాశకర ఆయుధాన్ని ఒక కఠినమైన హెచ్చరికగా వాడుకుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు పదేపదే చెబుతున్నారు. నిజంగా జపాన్‌ని ఓడించే ఉద్దేశమే అయితే.. ఒక దాడితో అమెరికా ఆగిపోవచ్చు. కానీ కావాలనే రెండో దాడి కూడా చేసి, తన కుటిలత్వాన్ని చాటుకుంది.

ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో అనేక దేశాలు తమ దేశీయ భద్రత కోసం సొంతంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేసుకునేందుకు తీవ్రమైన ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, సౌదీ అరేబియా లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటూ, నిరంతరం భద్రతా పరమైన ముప్పునూ, యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ వంటి దేశాలు కూడా అణు పరిజ్ఞానం దిశగా ఆలోచనలు చేయడం ప్రారంభించాయి. కానీ, అమెరికా తనకున్న అపారమైన ఆర్థిక, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అంతర్జాతీయ వేదికలపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి.. ఈ దేశాలను అణు బాట పట్టకుండా అడ్డుకుంటోంది. అమెరికా ఆంక్షల భయంతో అనేక దేశాలు తమ అణు కార్యక్రమాలను ఆపేసి వెనక్కి తగ్గుతున్నప్పటికీ, భవిష్యత్తులో తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి అణు బాంబే ఏకైక, శాశ్వతమైన మార్గమని ఆ దేశాల ప్రభుత్వాలు అంతర్గతంగా బలంగా నమ్ముతున్నాయి. ఎందుకంటే.. అణ్వాయుధాలు లేని దేశాలపైనే అమెరికా దాడులు చేస్తోంది. అణు బాంబుు ఉన్న దేశాల జోలికి వెళ్లట్లేదు.

ప్రపంచవ్యాప్తంగా అణు వ్యాప్తికి సంబంధించిన అసలు సమస్య అంతా.. అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు తమ దగ్గర ఉన్న వేల అణ్వాయుధాలను శాశ్వతంగా వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేకపోవడమే. “ముందు మీరు మీ దగ్గర ఉన్న అణు బాంబులను పూర్తిగా ధ్వంసం చేయండి, ఆ తర్వాత మేము కొత్తగా వాటిని తయారు చేయకుండా ఉంటాం” అన్నది మిగిలిన ఇతర దేశాల న్యాయమైన వాదన. అమెరికా తన దగ్గర ఉన్న అణ్వాయుధాల్ని ఏమాత్రం వదులుకోకుండా, నిరంతరం వాటిని సరికొత్త టెక్నాలజీతో ఆధునికీకరిస్తూ ఉండటం వల్లే, ప్రపంచ దేశాలు కూడా రహస్యంగానైనా సరే వాటిని తయారుచేసుకునేందుకు విపరీతంగా ఆసక్తి చూపుతున్నాయి. ఆ పరిస్థితిని అమెరికా తెస్తోంది. ఈ విధంగా చూస్తే ప్రపంచంలో అణు ప్రమాదం ఏటేటా విపరీతంగా పెరిగిపోవడానికి పరోక్షంగా అమెరికా అనుసరిస్తున్న ఈ ఆధిపత్య, పక్షపాత విధానాలే ప్రధాన కారణం అని ఎవరైనా నిర్మొహమాటంగా చెప్పవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అణు బాంబులు ఉన్నాయి..?

మరి ఇన్ని ఆంక్షల మధ్య, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని అణు బాంబులు ఉన్నాయో లెక్కలు చూస్తే ఆ సంఖ్య ఎవరికైనా తీవ్రమైన భయభ్రాంతులు కలిగిస్తుంది. అంతర్జాతీయ ఆయుధాల విశ్లేషణలో అత్యంత విశ్వసనీయమైన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన 2026 నాటి రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,187 అణు వార్‌హెడ్‌లు (Nuclear Warheads) ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా అనే తొమ్మిది దేశాలు మాత్రమే ఈ అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా, ఏటా ఈ దేశాలు తమ అణు సామర్థ్యాన్ని ఆధునికీకరిస్తూ, తమ ఆయుధాల వినాశనకర శక్తిని మరింత దారుణంగా పెంచుకుంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మొత్తం 12,187 అణు బాంబులలో దాదాపు 9,745 బాంబులు మిలిటరీ స్టాక్‌పైల్స్‌లో, అంటే ఏ క్షణంలోనైనా యుద్ధానికి నేరుగా ఉపయోగించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ప్రముఖ శాస్త్రవేత్తల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS)కి చెందిన తాజా డేటా స్పష్టంగా ధృవీకరిస్తోంది. ఇందులో యావత్ మానవాళిని భయపెట్టే అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో సుమారు 46 శాతం బాంబులు కేవలం అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా దేశాల గుప్పిట్లోనే బంధీ అయి ఉన్నాయి. ఒక్క క్షణం పాటు ఈ దేశాల నాయకులు తమ విచక్షణ కోల్పోయి న్యూక్లియర్ బటన్ నొక్కితే, ప్రపంచం మొత్తం క్షణాల్లో బూడిదగా మారిపోయేంత అత్యంత వినాశకరమైన, ప్రళయకాల అణు సామగ్రి ప్రస్తుతం మన భూమిపై పొంచి ఉంది.

అణుదాడి జ‌రిగితే మాన‌వుడి ఆరోగ్యంపై ఎలా ప్ర‌భావం చూపిస్తాయి..

అణుదాడి (Nuclear Attack) జ‌రిగితే మానవ ఆరోగ్యంపై తీవ్రమైన, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయని వైద్య నిపుణులు, అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అణు విస్ఫోటనం వల్ల వెలువడే తీవ్రమైన వేడి, కాంతి, రేడియోధార్మిక కిరణాలు (Radiation) మానవ శరీరాన్ని తక్షణమే కాకుండా, రాబోయే తరాల వరకు ప్రభావితం చేస్తాయి.

అణుదాడి చూపించే ఆరోగ్య ప్రభావాలను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు..

  1. తక్షణ ప్రభావాలు (Immediate Impacts)

విస్ఫోటనం జరిగిన మొదటి కొన్ని నిమిషాల నుండి కొన్ని వారాల లోపు ఇవి కనిపిస్తాయి:

  • తీవ్రమైన కాలిన గాయాలు (Thermal Burns): అణుబాంబు పేలినప్పుడు సూర్యుడి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో కూడిన వేడి వెలువడుతుంది. దీనివల్ల పేలుడు కేంద్రానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజల చర్మం కూడా పూర్తిగా కాలిపోతుంది.
  • తాత్కాలిక లేదా శాశ్వత అంధత్వం: విస్ఫోటనం వల్ల వచ్చే విపరీతమైన కాంతిని చూడటం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది.
  • శారీరక గాయాలు (Blast Injuries): పేలుడు వల్ల వచ్చే తీవ్రమైన ఒత్తిడి తరంగాలు (Shockwaves) బిల్డింగ్‌లను కూల్చేస్తాయి, దీనివల్ల అవయవాలు విరిగిపోవడం, అంతర్గత రక్తస్రావం జరగడం వంటివి సంభవించి తక్షణ మరణాలు సంభవిస్తాయి.
  1. స్వల్పకాలిక ప్రభావాలు – రేడియేషన్ సిక్‌నెస్ (Acute Radiation Syndrome – ARS)

అధిక మోతాదులో రేడియోధార్మిక కిరణాలకు గురికావడం వల్ల కొన్ని గంటలు లేదా రోజుల్లో ARS లక్షణాలు కనిపిస్తాయి:

  • కడుపులో వికారం మరియు వాంతులు: రేడియేషన్ ప్రభావం జీర్ణవ్యవస్థపై పడటం వల్ల విపరీతమైన వాంతులు, విరేచనాలు, తలనొప్పి వస్తాయి.
  • రక్త కణాలు పడిపోవడం: రేడియేషన్ వల్ల ఎముక మజ్జ (Bone Marrow) దెబ్బతింటుంది, దీనివల్ల తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు తగ్గిపోయి రోగనిరోధక శక్తి పూర్తిగా నశిస్తుంది.
  • అంతర్గత అవయవాల వైఫల్యం: గుండె, ఊపిరితిత్తులు, మరియు కేంద్ర నరాల వ్యవస్థ (Brain) దెబ్బతిని మరణం సంభవిస్తుంది.
  1. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు (Long-term Health Effects)

అణుదాడి నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ, రేడియేషన్ ప్రభావం వల్ల జీవితాంతం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది:

  • క్యాన్సర్ల బారిన పడటం: రేడియేషన్ వల్ల కణాల DNA దెబ్బతిని భవిష్యత్తులో లుకేమియా (బ్లడ్ క్యాన్సర్), థైరాయిడ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.
  • జన్యుపరమైన లోపాలు (Genetic Mutations): రేడియేషన్ బాధితులకు పుట్టబోయే పిల్లలలో అంగవైకల్యం, మానసిక వైకల్యం, జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది.
  • గర్భస్రావాలు: గర్భిణీ స్త్రీలు రేడియేషన్‌కు గురైతే పిండం ఎదుగుదల లోపించడం లేదా గర్భస్రావం జరగడం సంభవిస్తుంది.
  • రోగనిరోధక శక్తి క్షీణించడం: పర్యావరణంలో రేడియోధార్మిక వ్యర్థాలు ఉండిపోవడం వల్ల ఆహారం, నీరు కలుషితమై అంటువ్యాధులు, కంటి శుక్లాలు, గుండె జబ్బులు వేగంగా పెరుగుతాయి.
  • మానసిక ఆరోగ్య సమస్యలు: అణు విధ్వంసాన్ని చూడటం, ప్రియమైనవారిని కోల్పోవడం వల్ల ప్రజలు తీవ్రమైన మానసిక ఆందోళన (PTSD) నిరాశకు గురవుతారు.
    దీనికి తోడు, అణుయుద్ధం వల్ల వాతావరణంలోకి చేరే పొగ, ధూళి సూర్యరశ్మిని అడ్డుకుని “న్యూక్లియర్ వింటర్” (భూమి చల్లబడిపోవడం) వంటి పరిస్థితిని తెస్తాయి, దీనివల్ల పంటలు పండక ప్రపంచవ్యాప్త కరువు ఏర్పడి మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం ఉంది.