అలా జరిగితే.. సహించేది లేదు..

అలా జరిగితే.. సహించేది లేదు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ – మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని నారాయణపేట డిఆర్డివో మొగులప్ప హెచ్చరించారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తనిఖీ 14 విడత ప్రజావేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. సామాజిక తనిఖీ 12 గంటలకు ప్రారంభం కావడంతో వివిధ గ్రామాల నుండి వచ్చిన కూలీలు ఉపాధి హామీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలలోసామాజిక తనిఖీ గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు.

ఊట్కూర్ మండలంలో 1-4-2024 నుండి 31-3-2025 వరకు చేపట్టిన పనులకు సామాజిక తనిఖీ చేపట్టగా మండలంలో రూ 4 కోట్ల 37 లక్షల 58864 నిధులతో పనులు చేపట్టగా కూలీలు 4 కోట్ల 16 లక్షల 74171 పనులు చేపట్టగా మెటీరియల్ పనులు 24 లక్షల 24 వేల 693 నిధులతో పనులకు తనిఖీ చేపడుతున్నారు. గ్రామాల వారిగా సామాజిక తనిఖీలు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కొనసాగిన వివిధ పనుల పై సోషల్ ఆడిట్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి వినయ్ కుమార్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎస్ఆర్పి కుమార్, ఏపీవో లక్ష్మీరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపాల్ తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply