Indrakeeladri | ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం..

Indrakeeladri | ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం..

ఒక్కరోజే అమ్మవారిని దర్శించిన 26,547 మంది..
4,918 దర్శనం టికెట్లు.. 7,176 మందికి అన్నప్రసాదం…
రూ.4.33 లక్షల విరాళాలు..
1,105 మంది తలనీలాలు సమర్పణ


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దసరా మహోత్సవాల నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరాగా ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేశారు.

బుధవారం ఆలయ వివరాలు…

బుధవారం అమ్మవారిని మొత్తం 26,547 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం 4,918 దర్శనం టికెట్లు జారీ చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల్లో 7,176 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదే రోజు 295 సేవలు, 1,105 మంది తలనీలాలు సమర్పించారు. ఆలయానికి భక్తుల నుంచి రూ.4,33,604 విరాళాలు అందాయి.