TG | కులంతో కాదు.. విద్య‌తోనే గుర్తింపు : రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాల‌ని అన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. బంజారాహిల్స్ లోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో గురుకులాల విద్యార్థులకు బహుమతులను ప్రధానం కార్యక్రమంలో పాల్గొన్న‌ ఆయన మాట్లాడుతూ..విద్యా సంస్థ‌ల‌లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద పీట వేస్తున్నామ‌న్నారు.. తాను చదివింది అంతా ప్రభుత్వ స్కూల్ లోనే అని, అయితే నేడు ప్రైవేట్ స్కూల్ లో ఎక్కువ మంది చదువుతున్నార‌ని వివ‌రించారు.. దీనిపై అంద‌రూ విశ్లేషించుకోవాల‌ని కోరారు. ..ఇక ఖాసిం మా ఊరు అతను..చ‌దివింది ప్ర‌భుత్వ బ‌డిలోనే, అప్పుడు ఆయ‌న‌ ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అయ్యాడని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మక కలిగించాలని సూచించారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉంద‌న్నారు.. అందరూ జీవితంలో రాణించేలా చదువుకోండి.. పిలిస్తే పలికేలా నేను ఉంటా.. పని చేస్తా.. యంగ్ ఇండియా నా బ్రాండ్.. నా బ్రాండ్ అంబాసిడర్లు మీరే అని పేర్కొన్నారు. అలాగే, ప్రజా ప్రభుత్వంలో దళిత బిడ్డలకు పట్టంకట్టామ‌న్నారు. కులం వల్ల ఎవరికీ సమాజంలో గుర్తింపు రాలేని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

మీరు ఓటేస్తే.. సిఎం అయ్యా..
సీఎం అంటే గాలి నుంచి ఉడి పడలేదు అన్నారు. మీ మద్యలో ఉంట .. మీతోనే ఉంటానని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆశీర్వదించండం వ‌ల్లే తాను ముఖ్యమంత్రి అయ్యాన‌ని అన్నారు… అందుకే వారి సంక్షేమం కోసం నిరంత‌రం కృషి చేస్తున్నాన‌ని పేర్కొన్నారు.. విద్యార్ది ద‌శ‌లో మొదటి 25 ఏళ్ల కష్టపడితే.. మరో 75 ఏళ్లు సంతోషంగా ఉండొచ్చు అన్నారు. అట్రాక్షన్ లో పడి లైఫ్ డివిఎట్ కాకండి అని విద్యార్ధుల‌కు సూచించారు. అలాగే, మీ తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి తేకండి అని కోరారు.

ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు చదువులు వద్దు.. కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించార‌న్నారు. దళితులు, బీసీలు.. గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్టుగా మాజీ సీఎం కెసిఆర్ వ్యవహరించార‌ని రేవంత్ పేర్కొన్నారు… తెలంగాణ వస్తే.. ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై ఆయ‌న‌ నీళ్లు చల్లార‌న్నారు. . మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు గానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నార‌ని మండిప‌డ్డారు… ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింద‌ని గుర్తు చేశారు.. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉందన్నారు. . సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నార‌ని , అటువంటి వారిని ప్రజలు నిలదీయాల‌ని పిలుపు ఇచ్చారు.. నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నార‌ని విమ‌ర్శించారు..

గ‌తంలో , కేసీఆర్ దళితులను అవమానించార‌ని అంటూ .. కానీ, ఇప్పుడు మా గడ్డం ప్రసాద్ కుమార్ నీ మైక్ అడిగి మాట్లాడేలా చేసింది తామేన‌ని సీఎం రేవంత్ చెప్పారు. అక్కడ తప్పించుకున్నా.. ఇక్కడ తప్పించుకోలేక పోయాడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.

Leave a Reply