Botsa Satyanarayana | కార్యకర్తలు తలెత్తుకునేలా చేస్తా..
కంటతడి పెట్టిన బొత్స..
భావోద్వేగానికి గురైన నేత
Botsa Satyanarayana | విజయనగరం, ఆంధ్రప్రభ : వైసీపీ విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో మాట్లాడిన ఆయన కంటతడి పెట్టుకున్నారు.
తనను నమ్మిన వారే మోసం చేశారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. వెన్నుపోటు పార్టీ అరాచకాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, కార్యకర్తలంతా తలెత్తుకుని తిరిగేలా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని బొత్స తెలిపారు. తన సహచరుల్లో పలువురు కేంద్ర మంత్రులుగా ఉన్నారని, తనను పిలిచినా వెళ్లకుండా రాజకీయ విలువలను కాపాడుకున్నానని చెప్పారు. పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని, ప్రజల కోసం నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
