- చిల్వకోడూరు సర్పంచ్ అభ్యర్థి తోట్ల లక్ష్మీరాజం
గొల్లపల్లి, ఆంధ్ర్రప్రభ : గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో తోట్ల లక్ష్మి రాజంకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిపిస్తే.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని, ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రచారం నిర్వహించరు.
గ్రామంలో తాగునీటి, వీధి దీపాలు, డ్రైనేజీ శుభ్రపరచడం, ప్రజా ఆరోగ్య వ్యవస్థపై చర్యలు తీసుకోవడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని చెప్పారు. గ్రామ ప్రజలు లక్ష్మీ రాజంకు ఓటు వేసి గెలిపించుకుంటామని తెలిపారు.

