అభివృద్ధి చేశాను.. అవకాశం ఇవ్వండి..

అభివృద్ధి చేశాను.. అవకాశం ఇవ్వండి..
- గ్రామ అభివృద్దే ధ్యేయంగా పని చేశాను..
- కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి
- కారు గుర్తు పై ఓటేసి గెలిపించండి
- అన్ని విధాలుగా అండగా నిలుస్తా..
- 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పెండ్యాల జ్యోతి ప్రభాకర్..
నర్సంపేట, ఆంధ్రప్రభ : గ్రామ సర్పంచిగా అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేశానని, కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి మిగిలి ఉన్నా సమస్యలను పరిష్కరించి పనులను పూర్తి చేస్తానని నర్సంపేట మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, ముగ్దంపురం గ్రామ తాజా మాజీ సర్పంచ్ పెండ్యాల జ్యోతి ప్రభాకర్ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలందరూ కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి కౌన్సిలర్ గా అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసే బాధ్యత మర్చిపోకుండా పని చేస్తానని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్న సమయంలో గ్రామ సిబ్బంది జీతాల గురించి సమ్మె చేస్తున్న సమయంలో చెత్త సేకరణ ఇబ్బందిగా మారిందని తెలుసుకొని నేనే స్వయంగా చెత్త సేకరించానని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు.
సర్పంచ్ గా అవకాశం ఇస్తే సేవకునిగా పని చేశానని దయచేసి కౌన్సిలర్ గా సైతం అవకాశం ఇవ్వాలని వారు ముగ్ధంపురం వార్డు ప్రజలను కోరుతున్నారు. ప్రతి వీధిలో సాధ్యమైనంత మేరా సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మించానని జ్యోతి ప్రభాకర్ గుర్తు చేస్తూ కౌన్సిలర్ గా ఒక అవకాశం ఇవ్వాలని కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరుతున్నారు. అందుబాటులో ఉన్న మేరా ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ మరియు ఎల్ వో సి అందించి అనారోగ్య బారిన పడిన వారికి సాయం చేశానని కౌన్సిలర్ గా ఒక అవకాశం ఇవ్వాలని వారు ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారం చేస్తున్న సమయంలో వార్డు ప్రజలందరూ అవకాశం ఇస్తానని హామీ ఇస్తున్నారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
