HYDRAA | పర్యావరణ హిత నగరానికి హైడ్రా దిక్సూచి : ఏవీ రంగనాథ్

పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి హైడ్రా దిక్సూచి అవుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. చెరువులు, పార్కులు, నాళాలు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా పరిరక్షేందుకు హైడ్రా ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

ఆదిలో హైడ్రా చట్టబద్ధతపై పలువురికి అనుమానాలున్నా తర్వాత అన్ని పటాపంచలయ్యాయన్నారు. వినియోగదారులకు, బ్యాంకులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుసంధనకర్తగా వ్యవహరించే సంస్థ HRCS India వెబ్సైట్ ను గురువారం ఎల్ బీ నగర్ లోని ఆ సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

జీవితంలో పెళ్లి, సొంత ఇల్లు చాలా ముఖ్యమైన అంశాలని.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘‘స్థిరాస్తి కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది సర్వే నంబర్లను మార్చేసి, ప్రైవేట్ పట్టాల అనుమతులతో ప్రభుత్వ భూముల్లో యిల్లు కట్టేసి అమ్మేస్తున్నారని అందుకే అన్ని విధాల పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

హైడ్రా రావడంతో ప్రజలందరికీ చెరువుల హద్దులు తెలిసాయి. FTL, బఫర్ జోన్లు గురించి చర్చించుకుంటున్నారు. త్వరలోనే నగరంలోని చెరువుల హద్దులు, ప్రభుత్వ భూముల వివరాలు ప్రజలందరికీ అందుబాటులో హైడ్రా ఉంచుతోంది. చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ముందుగా 6 చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించాం. వచ్చే వర్షాకాలానికి ఇవి సిద్ధమవుతాయి.

చెరువులు, నాలా ల అభివృద్ధితో నగరంలో వరద ముప్పును కూడా నివారించ వచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడానికి అనేక కారణాలున్నాయి. ప్రపంచంలో ఆర్థిక మాంద్యంతో అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్పీడ్ తగ్గింది.

నగరంలో దాదాపు 3 లక్షలవరకు ఫ్లాట్లు, ఇల్లు ఇప్పటికే కట్టి ఉన్నాయని.. అవి అమ్ముడుపోవాల్సి వుంది. ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. మోసాలకు ఆస్కారం లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం 2008లో కూడా మందగించింది అని… అందరికీ అందుబాటు ధరల్లో ఫ్లాట్లు ఉంటే వ్యాపారం పుంజుకుంటుంది అని’’ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.

ఇలాంటి తరుణంలో HRCS INDIA సంస్థ వినియోగదారుడికి తోడుగా ఉండి మోసాలకు ఆస్కారం లేకుండా బ్యాంక్ ల వారితో సరైన ప్రాజెక్టులకు లోన్లు వచ్చేలా చూడడం ఆహ్వానించదగ్గ విషయం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *