Hyderabad | ఎంఎంటీఎస్‌ రైలు బోగీలో అత్యాచారయత్నం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. అతన్ని ప్రతిఘటించిన బాధితురాలు కదులుతున్న రైలులో నుంచి కిందికి దూకేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో మేడ్చల్‌కు బయలుదేరింది. మహిళల కోచ్‌లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్‌ స్టేషన్‌ దిగిపోయారు. దీంతో బోగీలో ఆమె ఒక్కతే అయిపోయింది. గుర్తించిన ఓ యువకుడు (25) ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించారు.

దీంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలు కొంపల్లి సమీపంలో రైలు నుంచి బయటకు దూకింది. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతిని గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి

Leave a Reply