Uttar Pradesh | మొబైల్ టవర్ ఎక్కిన భర్త…
Uttar Pradesh | మొబైల్ టవర్ ఎక్కిన భర్త…
భార్యను తిరిగి తీసుకురావాలంటూ పట్టుబాటు..
పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది చొరవతో సురక్షితంగా కిందకు
Uttar Pradesh | మీరట్, అక్టోబర్ 4 (ఆంధ్రప్రభ): ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై మొబైల్ టవర్ ఎక్కిన ఘటన కలకలం రేపింది. ఫైజ్ అనే వ్యక్తి తన భార్యను తిరిగి తీసుకురావాలంటూ టవర్‌పైకి ఎక్కి కిందకు దిగేందుకు నిరాకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె అమ్రోహాలోని పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన ఫైజ్ లోదీపూర్ గ్రామంలోని జియో మొబైల్ టవర్ ఎక్కాడు. పైకి చేరుకున్న అనంతరం భార్యను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కిందకు వచ్చేందుకు నిరాకరించాడు.
ఫైజ్ టవర్ ఎక్కిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అతడిని కిందకు దిగాలని పలుమార్లు కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని అతడితో మాట్లాడారు. కొంతసేపు నచ్చజెప్పిన అనంతరం ఫైజ్ కిందకు దిగేందుకు అంగీకరించడంతో అతడిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
