AP | దంపతుల మృతి..
AP | దంపతుల మృతి..
AP | గోపాలపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోపాలపురంలోని కుమ్మరికుంట కాలనీలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతి చెందారు. పెంటబోయిన పెద్ద బంగారయ్య (57), అప్పల నరసమ్మ (53) దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం.. దుస్తులు ఆరేస్తున్న సమయంలో మొదట అప్పల నరసమ్మ విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆమెను రక్షించేందుకు భర్త పెద్ద బంగారయ్య ప్రయత్నించగా, ఆయనకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఒకే ఘటనలో భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో కుమ్మరికుంట కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
