Hundi calculation | హుండీఆదాయం లెక్కింపు..

Hundi calculation | హుండీఆదాయం లెక్కింపు..

  • శివరాత్రి జాతర హుండీ ఆదాయం రూ.10 07596 లక్షలు..

Hundi calculation | వైరా, ఆంధ్రప్రభ : వైరా మండల పరిధిలోని స్నానాల లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతరకు సంబంధించిన హుండీ లెక్కింపు పూర్తయింది. ఆలయ చైర్మన్ దొడ్డ ఉషారాణి సభ్యులు మల్లు శేషమ్మ సుల్తాన్ పద్మ తలారి నరసింహారావు మొగునూరి సత్యనారాయణ సర్పంచ్ నూతి వెంకటేశ్వరరావులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.. జాతర ఆదాయం మొత్తం రూ.10 07596 లక్షలని ఈవో హరిచంద్ర శేఖర్ పేర్కొన్నారు…

భక్తుల కానుకల ద్వారా రూ.362950 అభిషేకం టికెట్ల ద్వారా రూ .49 200 లు శీఘ్ర దర్శనం రూ 131196లు ప్రత్యేక దర్శనం రూ 84900 లు దర్శనం రూ 45850 లు జాతర షాపుల ఆదాయం రూ.150500లు కొబ్బరి చెప్పుల వేలంపేట 43 000 రూపాయలు లడ్డు ప్రసాదం రూ.140000లు మొత్తం రూ.10 07596 లు గత సంవత్సరం మొత్తం ఆదాయం రూ.943564లు.కాగా గత సంవత్సరం కంటే రూ.64032లు ఆదాయం పెరిగిందని ఆలయ ఈవో తెలిపారు…

ఈవో తో పాటు పంచాయతీ కార్యదర్శి ఆర్ భారతి వైరా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డ పుల్లయ్య మల్లు రామకృష్ణ ఉప సర్పంచ్ అమ్మిక వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు దేవాలయ పూజారి కంచెల చంద్రశేఖర్ శర్మ సుల్తాన్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply