వనదేవతలను దర్శించుకున్న గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి

తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్‌ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు ఆయనను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు.

అనంతరం మేడారంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను అదనపు కలెక్టర్‌, స్థానిక ఎంపీడీవోలతో కలిసి వి.పి. గౌతమ్‌ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమంలో మేడారం సర్పంచ్‌ పీర్ల భారతి–వెంకన్న, ఉపసర్పంచ్‌ అలకుంట వనిత–కృష్ణ, ఇన్‌చార్జి ఎంపీఓ శరత్‌, హౌసింగ్‌ ఏఈ భార్గవి, పీఆర్‌ ఏఈ రజనీకాంత్‌, మండల అధికారులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గొంది సరిత, ఎస్సీ మండల నాయకుడు గజ్జెల నారాయణ, వార్డు సభ్యురాలు నాలీ సావిత్రి, ఇతర నాయకులు పాల్గొన్నారు.