నేత‌ల‌ ప్రచారం

వెంగళరావు నగర్ ,ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళ‌రావు నగర్ డివిజన్, కళ్యాణ్ నగర్ (1.2.3.4 వీధుల్లో ) సిద్ధార్థ్ నగర్..ఏజీ కాలనీ (AG Colony)..టీబీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లైన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, అసద్ బాబా, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయి దయానంద్, గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సరిత తిరుపతయ్య యాదవ్, బీసీ జేఏసీ చైర్మన్ శ్రీశైలం యాదవ్, సినీ నటుడు సుమన్, మాజీ కార్పొరేటర్ మనోహర్, మహమ్మద్ యూసుఫ్ బాబా, అలాగే స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నేతలు మాట్లాడుతూ.. యువకుడు ప్రజాసేవకుడు పిలిస్తే పలికే నాయకుడు, ఏ అర్ధరాత్రి ఏ కష్టం వచ్చినా ప్రజల సమస్యలను పరిష్కారం ( problems Solve) చేసే దిశగా ముందుకు సాగుతున్న నాయకుడు.. రాబోయే నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, చేతిగుర్తుపైన ఓటు వేసి ఘన విజయంతో గెలిపించి, అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పాలనను బలపరచాలని ప్రజలను కోరారు. స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నవీన్ యాదవ్ కు తమ మద్దతు తెలియజేశారు.

Leave a Reply