హత్యకు గురైన హెటల్ వెయిటర్
జగిత్యాల, ఆంధ్రప్రభ : ఓ ఇద్దరి మధ్యలో జరుగుతున్నగొడవను నిలువరించేందుకు వెళ్లిన హోటల్ వెయిటర్(Hotel waiter) కుకింగ్ మాస్టర్ చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల(Jagityala) పట్టణ శివారులోని ఓ దాబాలో వంట మాస్టర్ గా పనిచేస్తున్ననేపాల్ కు చెందిన చరణ్ దీప్ సింగ్ హోటల్(Charandeep Singh Hotel)లో పనిచేసే మరో వ్యక్తితో గొడవపడుతున్నాడు.
గొడవను గమనించిన వెయిటర్ వంగ శ్రీనివాస్ (44) ఇరువురి గొడవను ఆపేందుకు ప్రయత్నం చేస్తుండగా, కోపంతో ఊగిపోయిన వంట మాస్టర్ చరణ్ దీప్ సింగ్ బీరు బాటిల్‌తో శ్రీనివాస్ తలపై బాధడంతో శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు.
హోటల్ నిర్వాహకులతో సమాచారం అందుకున్నజగిత్యాల టౌన్ పీఎస్ పోలీసులు(PS Police) శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని జగిత్యాల జీజీహెచ్(GGH) మార్చురీకి తరలించారు. కాగా ఘటనపై జగిత్యాల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల ఆటో కిరాయి విషయంలో బీహార్(Bihar)కు చెందిన వలస కూలీల చేతిలో ఆటో డ్రైవర్ హత్యకు గురికాగా,20 రోజులు కూడా గడవకు ముందే నేపాల్ కు చెందిన వంట మాస్టర్ చేతిలో వెయిటర్ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

