వారణాసి – ఉత్తరప్రదేశ్ : పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రాఫెల్ యుద్ధ విమానాలు బయటకు వెళ్లాల్సి ఉండగా, వాటిని హ్యాంగర్లలో ఎందుకు నిలిపి ఉంచారని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.. పాక్ – భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తత సయమంలో కూడా ఈ అత్యాధునిక యుద్ద విమానాలను ఎందుకు లోపలుంచారంటూ ప్రశ్నించారు.. వాటిని దిష్టి బొమ్మలుగా భావిస్తున్నారంటూ ఆ విమాన బొమ్మలకు నిమ్మకాయలు, రెడ్ చిల్లీలు దంగగా కట్టి ప్రదర్శించారు.. అంతే కాకుండా దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది నింబు మిర్చి రాజకీయాలంటూ ఆయన మండిపడ్డారు.. వారణాసిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన ఇంత వరకు ఉగ్రవాదం ఎటువంటి చర్యలు తీసులోదని మోదీ పై ఫైర్ అయ్యారు..
దీనిపై ఉత్తర ప్రదేశ్ బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు.. పాకిస్థాన్ ప్రభుత్వానికి అజయ్ రాయ్ పిఆర్ గా వ్యవహరిస్తున్నాంటూ మండిపడ్డారు.. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో ప్రధాని మోదీకి తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు.. కాంగ్రెస్ నేతలు నింబు మిర్చి అంటూ పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ వారు ఆరోపించారు.