నడిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
నిజామాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి-47పై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారు.
ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటమే ఘటనకు ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
