సహకార సంఘం చైర్మన్ ముత్యాల శ్రీనివాస్‌కు సన్మానం
మున్నూరు కాపు బిడ్డకు కీలక బాధ్యత దక్కడం గర్వకారణం
రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలి: సంఘం నాయకులు
దండెపల్లి, ఆంధ్రప్రభ: నెల్కి వెంకటాపూర్ సహకార సంఘం నూతన చైర్మన్‌గా ఎన్నికైన ముత్యాల శ్రీనివాస్‌ను దండెపల్లి మండలం మెదరిపేట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు శ్రీనివాస్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ముత్తినేని మల్లేష్ మాట్లాడుతూ ముత్యాల శ్రీనివాస్ సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నిక కావడం మున్నూరు కాపు సమాజానికి గర్వకారణమన్నారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసి సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. మున్నూరు కాపు యువత రాజకీయ, సామాజిక, సహకార రంగాల్లో ముందుకు వచ్చి ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సహకార సంఘం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ కృషి చేయాలని నాయకులు కోరారు. తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మెదరిపేట మున్నూరు కాపు సంఘం నాయకులు, ప్రతినిధులు, యువకులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొని నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
