Honored | ఎమ్మెల్యేకి ఘన సత్కారం
- రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
- ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన గోగినేనిపాలెం వాసులు
Honored | ఘంటసాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ఘంటసాల మండలంలోని కొడాలి నుంచి శ్రీకాకుళం వరకు వయా గోగినేనిపాలెం(Goginenipalem) గ్రామ రహదారి అభివృద్ధికి కూడా రూ.2.10కోట్లు నిధులు మంజూరు చేసింది. ఎన్నో సంవత్సరాలుగా గోగినేని పాలెం వాసులు పడుతున్న ఇబ్బందులను గమనించి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రత్యేకంగా చొరవ చూపి నిధులు మంజూరు(Grant of funds) చేయించారు.
దీంతో గోగినేని పాలెం వాసులు ఎమ్మెల్యేను శుక్రవారం ఘనంగా సత్కరించారు. గోగినేనిపాలెం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కుంపటి సుబ్బారావు, ఏఎంసి వైస్ చైర్మెన్ అత్తలూరు గోపీచంద్, శ్రీకాకుళం ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు, గ్రామస్తులు బోలె మోహన్, కుంపటి చక్రవర్తి, కర్రా గోపీ, కుంపటి నాగరాజు, కొడాలి వంశీ, కుంపటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

