ఉపాధ్యాయులలో ఉత్తములకే గౌరవం : ఎంఈఓ రాజేందర్
జన్నారం, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులలో ఉత్తములకే ఎంతో గౌరవం లభిస్తుందని స్థానిక మండల విద్యాధికారి బి.రాజేందర్ తెలిపారు.జన్నారం మండల కేంద్రంలోని ఎంపీ యుపీఎస్ టీచర్ విజయకుమారి గత నెల 30తో పదవి విరమణ పొందిన సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో పీఆర్టీయు మండల శాఖ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేసి శాలువాకప్పి, పూలమాలలువేసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగరీత్యా రచ్చలేని ఉపాధ్యాయురాలుగా పని చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీ యు(టీఎస్) మండల శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కట్ట రాజమౌళి,అనుముల రాజన్న, స్థానిక బాయ్స్ హైస్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచి సుష్మ-భూమేష్, వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం.బాబు, హెచ్ఎం, ఉపాధ్యాయులు శంకర్,సుధాకర్ నాయక్,బి.ప్రకాష్, శ్రీనివాస్, సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.
