Honor | ఏక‌గీవ్ర స‌ర్పంచ్‌కు స‌న్మానం

Honor | తంగళ్ల‌పల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : తంగ‌ళ్ల‌ప‌ల్లి మండలం గండి లచ్చిపేట పంచాయతీ ఎన్నికల్లో ఏక‌గీవ్ర‌మైన స‌ర్పంచ్‌, పాల‌క‌వ‌ర్గ స‌భ్యుల‌కు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెస్ చైర్మన్(Cess Chairman) చిక్కాల రామారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజ బింకర్ రాజన్న గజమాల, పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జంగిటి అంజయ్య మాట్లాడుతూ త‌న‌పై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా సర్పంచ్(Sarpanch unanimously) పదవిని కట్టబెట్టిన గ్రామ ప్రజలకు, పెద్దలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, సేవ చేస్తానని అన్నారు.

అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్న గండి లచ్చపేట(Gandi Lachhapet) గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపి, గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. గండి లచ్చ పేట గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం సర్పంచ్ జంగటి అంజయ్య , ఉప సర్పంచ్ పుట్ట భాను(Deputy Sarpanch Putta Bhanu), బల్లెపు ప్రశాంత్, పుట్ట దేవరాజు, బామ్మ గారి వజ్రమ్మ, కుక్కల ఉమా, చదల సుమన్, బిపేట రేణుక, ఆనరాశి జలంధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడిగల రాజు, మాట్ల మధు, వలకొండ వేణు గోపాల్ రావు, పొన్నం శంకర్, దేవుని రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply