ఘనంగా హోలీ సంబరాలు..

ఘనంగా హోలీ సంబరాలు..
దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో చిన్న పిల్లలు, యువకులు, ఉద్యోగులు అంతా కలిసి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కామ దహనం తర్వాత వచ్చే హోలీ పండుగను చిన్నా పెద్ద అంతా కలిసి కులమత బేధాలు లేకుండా రంగురంగుల రంగులతో ఒకరిపై ఒకరు ప్రేమ ఆప్యాయతో రంగులు పూస్తూ కేరింతలతో జరుపుకునే గొప్ప పండుగ హోలీ. అలాగే పిల్లలతో పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఈ హోలీని జరుపుకున్నారు.
