Hockey-Umpire-Sent-Back : హాకీ అంఫైర్ ఔట్ .. ! Andhra Prabha Sports News

Hockey-Umpire-Sent-Back : హాకీ అంఫైర్ ఔట్ .. ! Andhra Prabha Sports News

  • ఏషియాడ్ లో క‌ల‌క‌లం
  • భార‌త అంపైర్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు
  • మలేసియా మహిళా ఫిర్యాదుతో ఇంటిబాట
  • హోటల్‌ సిబ్బందితోనూ అనుచిత ప్రవర్తన

(నాగోయా, ఆంధ్ర‌ప్ర‌భ‌)

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ అంఫౌర్ వివాదాల్లో ఇరుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం కలకలం రేపింది. హాకీ అంపైర్‌, టెక్నికల్‌ అధికారి గురిందర్‌ సింగ్‌ సాంఘాపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు రావడంతో ఆయన్ను ఏషియాడ్‌ నుంచి వెనక్కి పంపినట్లు సమాచారం. నాగోయాలో సాంఘా బస చేసిన సమయంలో.. మలేసియాకు చెందిన ఓ మహిళా హాకీ అధికారితో పాటు హోటల్‌ సిబ్బందితో ఆయన అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయని హాకీ ఇండియా వర్గాలు వెల్లడించాయి.
హాకీ ఇండియా అధికారి పీటీఐతో మాట్లాడుతూ.. మలేసియా మహిళా అధికారి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు నేపథ్యంలో సాంఘాను స్వదేశానికి పంపినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆయన భారత్‌కు తిరిగి వెళ్లినట్లు చెప్పారు.

తప్పు తేలితే కఠిన చర్యలు

సాంఘాపై వచ్చిన ఆరోపణలపై హాకీ ఇండియా తదుపరి చర్యలు తీసుకుంటుందా? అన్న ప్రశ్నకు ఆ సంస్థ అధికారి స్పందించారు. ఏషియన్‌ హాకీ ఫెడరేషన్‌ నుంచి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏహెచ్‌ఎఫ్‌ నివేదికలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని, దోషిగా నిర్ధారణ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెప్పారు.
ప్రస్తుతానికి ఆరోపణలపై తుది నిర్ధారణ జరగలేదు. ఏహెచ్‌ఎఫ్‌ దర్యాప్తు, నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉండనున్నాయి ఆసియా క్రీడల్లో హాకీ పోటీలకు అంపైర్లు, టెక్నికల్‌ అధికారులను ఏషియన్‌ హాకీ ఫెడరేషన్‌ (AHF) నియమిస్తుంది. ఈ అంశంలో భారత ఒలింపిక్‌ సంఘం (IOA), హాకీ ఇండియాకు నేరుగా నియామక బాధ్యత లేదని ఓ IOA అధికారి స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏహెచ్‌ఎఫ్‌ అధికారులను సంప్రదించగా.. నాగోయాలో వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

గతంలోనూ ఫిర్యాదు

సాంఘాపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదని సమాచారం.2025లో రాంచీలో జరిగిన హాకీ ఇండియా లీగ్‌ సందర్భంగా ఓ మహిళా అంపైర్‌ ఆయనపై ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆరోపణలపై విచారణ జరిపేందుకు హాకీ ఇండియా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ విచారణలో సాంఘాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి గణనీయమైన ఆధారాలు లభించలేదని హాకీ ఇండియా అధికారి తెలిపారు. అప్పటి విచారణలో ఆరోపణలు రుజువు కాలేదని పేర్కొంటూ.. తాజా వ్యవహారంపై మాత్రం ఏహెచ్‌ఎఫ్‌ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని హాకీ ఇండియా స్పష్టం చేసింది.

వరుస వివాదాలు

సాంఘా వ్యవహారం వెలుగులోకి రావడం భారత హాకీ వర్గాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ భారత మహిళల జాతీయ హాకీ జట్టుకు చెందిన సహాయక సిబ్బందిలో ఒకరిపై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో హాకీ ఇండియా సదరు సిబ్బంది సభ్యుడిని తొలగించింది.ఇప్పుడు ఆసియా క్రీడల సందర్భంగా అంపైర్‌, టెక్నికల్‌ అధికారిపై లైంగిక దుర్వ్యవహార ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

ఏహెచ్‌ఎఫ్‌ నివేదికపైనే ఉత్కంఠ

ప్రస్తుతం సాంఘా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆరోపణలపై పూర్తి వివరాలను ఏహెచ్‌ఎఫ్‌ నుంచి హాకీ ఇండియా కోరుతోంది. ఫిర్యాదు ఏ మేరకు నిజం? ఆరోపణలకు ఆధారాలున్నాయా? అన్నది ఏహెచ్‌ఎఫ్విచారణలో తేలాల్సి ఉంది.ఆ నివేదిక ఆధారంగా హాకీ ఇండియా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు సాంఘాపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే. విచారణ పూర్తై సంబంధిత సంస్థలు తుది నిర్ణయం తీసుకునే వరకు వాటిని నిర్ధారి