చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి పితృవియోగం
కట్కూరి నరసయ్య మృతి.. పలువురు నాయకుల పరామర్శ
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కట్కూరి మొగిలి తండ్రి కట్కూరి నరసయ్య మంగళవారం రాత్రి అకాల మరణం చెందారు. నరసయ్య మృతదేహాన్ని పలు పార్టీలకు చెందిన నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడికి కుమార్, మొగిలి, ఐలయ్య, నరసింహారాములు, మహేందర్ అనే ఐదుగురు కుమారులు ఉన్నారు.
ఈ సందర్భంగా చిట్యాల సర్పంచ్ తవటం లక్ష్మితో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు దబ్బేట అనిల్, గూట్ల తిరుపతి, అల్లం రవీందర్, తవటం నవీన్, గొర్రె సాగర్, కుంభం క్రాంతి కుమార్‌రెడ్డి, బీజేపీ నాయకులు బుర్ర వెంకటేష్‌గౌడ్, ఏవైఎస్ నాయకులు పుల్ల మల్లయ్య, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు తదితరులు నరసయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
