High School | ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

High School | ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

High School | ముధోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ముధోల్ లో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల(high school)లో ఈ రోజు ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సారథి రాజు మాట్లాడుతూ… విద్యార్థులు చక్కటి సాంప్రదాయ దుస్తులలో వచ్చి ముగ్గుల పోటీలలో పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని అందంగా అలంకరించారని అన్నారు.

పలువురు విద్యార్థులు హరిదాసుల వేషధారణతో సాంప్రదాయ నృత్యాలతో అలరించారని, పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఎడ్ల బండి తయారు చేసి భోగిమంటలు, నృత్యాలతో చిన్నారులు ఆనందంగా మురిసిపోయారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి భోగి భాగ్యాలు కలగాలని కోరుతూ సంక్రాంతి శుభాకాంక్షలు(Good luck) తెలియజేశారు.

High School |
High School |

రంగులవల్లి పోటీలలో విద్యార్థినిలు ఆహ్లాదకరంగా పాల్గొన్నారు. ముత్యాల ముగ్గులు వేసి పతంగులను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు రవీందర్ పాండే, పాఠశాల సమితి అధ్యక్షుడు కొండవార్ సంజీవ్, సమితి కార్యదర్శి ధర్మపురి సుదర్శన్, సమితి సభ్యుడు కందోళ్ల దత్తు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

High School |
High School |
High School |

CLICK HERE TO READ MORE : India One Air |కుప్పకూలిన చార్టర్డ్ విమానం…

CLICK HERE TO READ MORE :

Leave a Reply