ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌

  • అరెస్టులు వద్దు..
  • నోటీసులతోనే దర్యాప్తు చేయాలి..
  • పోలీసులకు హైకోర్టు ఆదేశాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎర్రవల్లి పసుపు నీళ్ల శుద్ధి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం నోటీసులు ఇచ్చి దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మార్గదర్శకాలను పట్టించుకోకుండా అరెస్టులు ఎలా చేస్తారంటూ పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ముందుకు వెళితే అంగీకరించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.