Hero Ram | ఈసారైనా సక్సెస్ వచ్చేనా..?

Hero Ram | ఈసారైనా సక్సెస్ వచ్చేనా..?

Hero Ram | రామ్ కెరీర్‌లో వరుస ఫ్లాపులు
మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నాలు
ఆంధ్రా కింగ్‌తో రూటు మార్చిన రామ్
కొత్త కథలు సిద్ధం చేస్తున్న హీరో రామ్
లోకేష్ కనకరాజ్ అసోసియేట్‌తో నెక్ట్స్ మూవీ?
ఈసారైనా సక్సెస్ అందుకుంటాడా రామ్?

Hero Ram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎనర్జిటిక్ హీరో రామ్.. ఒకప్పుడు యూత్ (Youth) ని బాగా ఆకట్టుకునేలా వరుసగా సినిమాలు చేసి సక్సెస్ సాధించాడు. ఈమధ్య కాలంలో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశాడు. వరుసగా ఫ్లాపులు రావడంతో కెరీర్ లో వెనకబడ్డాడు. తనే కథలు రాసుకుంటున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు రామ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్ అయ్యిందని.. కాకపోతే మళ్లీ రిస్క్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. రామ్ నెక్ట్స్ మూవీ ఎవరితో..? రామ్ చేస్తున్న తప్పు ఏంటి..?

Hero Ram | బాగానే ప్రమోట్ చేసారు కానీ..

రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మాస్ లో మంచి క్రేజ్ తీసుకురావడంతో.. మరింత జోష్‌ తో మాస్ సినిమాలు చేశాడు. రెడ్, వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్.. ఇలా మాస్ ని మెప్పించాలని తెగ ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. దీంతో రూటు మార్చాడు. ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ చేశాడు. క్లాస్ గా ఉండే సినిమా (Movie) అయినా తనకు సక్సెస్ అందిస్తుందని బలంగా నమ్మాడు రామ్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసారు. అయితే.. టాక్ బాగానే వచ్చింది.. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ రాలేదు.

Hero Ram

Hero Ram | లోకేష్‌ కనకరాజ్ అసోసియేట్ తో రామ్..

దీంతో ఆలోచనలో పడిన రామ్.. తన కథలను తనే రాసుకుంటున్నాడని.. ఓ నాలుగు కథలు రెడీగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. అలాగే రామ్ ని కొంత మంది సీనియర్ డైరెక్టర్స్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ కలిసారని.. అతనితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చెప్పారని టాక్ వచ్చింది. దీంతో ఏ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడో అంటూ రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రామ్ నెక్ట్స్ మూవీని కొత్త దర్శకుడితో ఫిక్స్ అయ్యిందని.. లోకేష్‌ కనకరాజ్ (Lokesh Kanakaraj) అసోసియేట్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని తెలిసింది. ఈ సినిమా లోకేష్‌ కనకరాజ్ స్టైల్ లో యాక్షన్ ప్రధానంగా ఉంటుందని టాక్. రామ్ కొత్త దర్శకుడితో సినిమా చేయడం.. పైగా యాక్షన్ మూవీ చేయనున్నాడని.. మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే.. రామ్ ఎలాంటి కథతో సినిమా చేస్తున్నాడో ఇంకా అనౌన్స్ చేయలేదు. యాక్షన్ మూవీనా కాదా అనేది తెలియాల్సివుంది. చూడాలి మరి.. ఈసారైనా రామ్.. ప్లాన్ ఫలిస్తుందో లేదో..

Hero Ram

Leave a Reply