న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : నేపాల్(Nepal)లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు నేపాల్‌లో చిక్కుకున్నతెలంగాణ పౌరులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో న్యూఢిల్లీ (New Delhi)లోని తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో ప్రత్యేక హెల్ప్‌లైన్(Helpline)ను ప్రారంభించింది. తెలంగాణ పౌరులెవరూ గాయపడినట్లు, లేదా తప్పిపోయినట్లు తెలిస్తే ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మాండు(Kathmandu)లోని భారత రాయబార కార్యాలయ సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పౌరుల భద్రత, వారు త్వరితగతిన స్వదేశానికి తిరిగి వచ్చేలా చూసుకుంటుంది. నేపాల్‌లో చిక్కుకున్న పౌరులు సహాయం కోసం, పౌరులు ఈ క్రింది అధికారులను సంప్రదించవచ్చు అని పేర్కొంది.
- వందన, రెసిడెంట్ కమిషనర్ , లైజన్ హెడ్ ప్రైవేట్ సెక్రటరీ.
+91 9871999044. - రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్.
+91 9643723157. - సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
+91 9949351270

