ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం చేసిన దాతలు

ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం చేసిన దాతలు
అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్ మహేందర్
చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని తంగడపల్లి గ్రామానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఇటుకమల్ల మహేందర్ రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తొర్పునూరి సాయిలు ఆధ్వర్యంలో శనివారం ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని ధైర్యం చెప్పారు. తమ వంతుగా రూ. 39,501 లు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్రోజు యజ్ఞమాచారి, గౌరవ సలహాదారు విశ్వనాథ చంద్రశేఖర్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు తొర్పునూరి సాయిలు గౌడ్, ప్రధాన కార్యదర్శి సుక్క స్వామి, కోశాధికారి వనం ఋషి, ప్రతినిధులు రాఘవేందర్ గౌడ్, చింతల గణేష్, కందగట్ల కృష్ణ, కత్తుల ప్రవీణ్, ఎర్ర శివ, నాని, సతీష్, వాసుదేవ్, దొనకొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
