ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం కార‌ణంగా తెలంగాణ రాష్ర్టం (Telangana State)లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ప్రస్తుతం వాయువ్య,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం కొనసాగుతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ క్రమంలో శనివారం (సెప్టెంబర్ 27) రోజున రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది.

అలాగే రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Leave a Reply