బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాన్ ప్రభావం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. బంగాళాఖాతం దాటిన మొంథా తుఫాను ప్రస్తుతం కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి నేరుగా దక్షిణ తెలంగాణ వైపు కదులుతోంది. తుఫాను మధ్య, పశ్చిమ తెలంగాణ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ ప్రభావంతో నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికార్‌ఆబాద్, యాదాద్రి, సాంగారెడ్డి, మెదక్, మెడ్చల్, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో రాత్రిపూట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను భూమిపైకి కదులుతున్నప్పుడు వాతావరణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారవచ్చని పేర్కొన్నారు.

